క్షమాపణ చెప్పినా సరే, ఇక నుంచి సూపర్ స్టార్ సినిమాలను విడుదలకానివ్వం..!

అంతర్జాతీయ స్థాయిలో అభిమానుల్లో సౌత్ స్టార్.. సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టార్ కి మన దక్షిణాదిలోనే ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. రజనీ నటించిన ‘కాలా’ చిత్రం కర్ణాటకలో ఏ అడ్డు లేకుండా విడుదలయ్యేలా కనిపించట్లేదు.

రజనీకాంత్ బహిరంగంగా క్షమాపణ చెప్పినా సినిమాను మాత్రం విడుదలకానివ్వమని.. అలాగే ఇకపై కూడ రజనీ సినిమాలేవీ విడుదల అవ్వకుండా అడ్డుకుంటామని.. కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి అన్నారు. దీనింతటికి కారణం కావేరి జలాల విషయంలో తమిళనాడుకు మద్దతుగా రజనీ, కమల్ చేసిన వ్యాఖ్యలే. మరి ఈ అడ్డంకులను తొలగించడానికి చిత్రం బృందం, సౌత్ ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.

Exit mobile version