అఖిల్ సినిమాలో ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో..’ రీమిక్స్..??

అఖిల్ సినిమాలో ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో..’ రీమిక్స్..??

Published on Nov 21, 2014 12:11 PM IST

Akhil
ప్రస్తుతం సినిమాలలో రీమిక్స్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా యంగ్ స్టార్ హీరోలు ఈ రీమిక్స్ సాంగ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి హీరోగా పరిచయం కాబోతున్న అక్కినేని అఖిల్ కూడా చేరుతున్నారు అని సమాచారం.

నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా ‘హలో బ్రదర్’లో పాటను రీమిక్స్ చేస్తున్నారు అని ఫిల్మ్ నగర్ టాక్. ఆ సినిమాలో ప్రేక్షకుల చేత డాన్స్ చేయించిన ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో..’ రీమిక్స్ ను అఖిల్ డెబ్యూ మూవీ కోసం రెడీ చేశారట.

వివి వినాయక్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాను నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మించనున్న సంగతి తెలిసిందే. వెలిగొండ శ్రీనివాస్ కథను అందిస్తున్నారు. ఈ సినిమా గురించి పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిని ఖండించడం లేదు, అలాగని ద్రువీకరించడం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు