ఆగని ‘ కాంతారా ‘ కలెక్షన్స్ జోరు…ఆ క్లబ్ లో చేరిక ..!


కన్నడలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ సక్సెస్ఫుల్ మూవీ కాంతారా. డివైన్ బ్లాక్ బస్టర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి స్వయంగా దీనికి దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయ కిరగందుర్ ఈ మూవీని నిర్మించారు.

ఇక ఇటీవల తెలుగు తోపాటు ఇతర భాషల్లో కూడా విడుదలై సంచలన విజయం దిశగా దూసుకెళ్తున్న కాంతారా అన్ని భాషల్లో కూడా భారీ స్థాయి కలెక్షన్లు అందుకుంటోంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా మొత్తంగా రూ. 305 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని ఫైనల్ గా 300 క్రోర్స్ క్లబ్ లో చేరింది. మరోవైపు పలు ప్రాంతాల్లో కాంతారా కి థియేటర్స్ కూడా పెంచుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ మూవీ మరింతగా కలెక్షన్ దూకుడు కొనసాగించే అవకాశం కనబడుతోంది అంటున్నారు విశ్లేషకులు.

Exit mobile version