సెన్సార్ పూర్తి చేసుకున్న “కపటనాటక సూత్రధారి”

Published on Aug 27, 2021 4:03 pm IST


విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం కపటనాటక సూత్రధారి. థ్రిల్లర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ ను పొందింది. ఫ్రెండ్స్ అడ్డా బ్యాన‌ర్‌పై మనీష్ నిర్మించిన ఈ సినిమా కు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ ఈ చిత్రానికి సహా నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మనీష్ మాట్లాడుతూ, ‘‘మా కపట నాటక సూత్రధారి సెన్సార్ పూర్తయ్యింది. మంచి థ్రిల్లర్ మూవీ చేశామని సెన్సార్ సభ్యులు మా టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. డైరెక్టర్ క్రాంతి సైన సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సుభాష్‌గారి విజువ‌ల్స్‌, రామ్‌గారి సంగీతం, వికాస్ నేప‌థ్య సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యాయి. కచ్చితంగా సినిమా ఆడియెన్స్‌ను డిఫ‌రెంట్ మూవీగా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన డిఫ‌రెంట్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది అనౌన్స్ చేస్తాం’’ అని అన్నారు.

ఈ చిత్రానికి సుభాష్ దొంతి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. రామ్ తవ్వా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామకృష్ణ మాటలు అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :