బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్నారు. 83 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. రణ్వీర్ భారత దేశానికి మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ రోల్ చేస్తున్నారు. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ చేజిక్కించుకోవడం జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని తెరపై ఆవిష్కరించేందుకు 83 మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తున్నారు. కాగా కపిల్ గా రణ్వీర్ మేకోవర్ అదిరింది. ఆయన లుక్ దాదాపు యంగ్ కపిల్ దేవ్ కి చాలా దగ్గరగా ఉంది. కాగా నేడు కపిల్ దేవ్ పుట్టినరోజు కావడంతో కపిల్ దేవ్, రణ్వీర్ కలిసి వున్న ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్, రణ్వీర్ పై ప్రశంసలు కురిపించారు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా కనిపించడానికి రణ్వీర్ హార్డ్ వర్క్ గురించి చెవుతూ, మెచ్చుకున్నారు. 83 చిత్రానికి కబీర్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
