ఛాయిస్ షాహిద్ దే అంటున్న కరణ్

Published on Aug 14, 2019 7:13 pm IST

గత కొన్నేళ్లకుగా తెలుగు చిత్రాలు హిందీలో విరివిగా రీమేక్ అవుతున్నాయి. సల్మాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు సైతం తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేసి గొప్ప విజయాలు అందుకున్నారు. ఇక తాజాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ అక్కడ కాసుల వర్షం కురిపించింది. దీనితో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ మరియు, నాని నటించిన జెర్సీ చిత్రాల హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు.

ఐతే ఈ రెండింటిలో ఏచిత్రం ముందు తెరకెక్కించాలనే సందిగ్ధంలో ఉన్నారట కరణ్. డియర్ కామ్రేడ్ వెంటనే మొదలుపెట్టాలనుకున్న ఆయన తెలుగులో ఈ చిత్ర ఫలితం తరువాత ఆలోచనలో పడ్డారట. ఐతే జెర్సీ, డియర్ కామ్రేడ్ రెండు చిత్రాలలో ఎదో ఒక చిత్రం షాహిద్ తో చేయాలని భావిస్తున్న కరణ్ ఛాయిస్ షాహిద్ కే వదిలేశారట. కాగా షాహిద్ కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎలాంటి చిత్రం చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారట.

ఐతే కరణ్ మాత్రం షాహిద్ అంగీకారం తెలిపితే రెండు చిత్రాలలో ఎదో ఒక చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారట. మరి ఈ విషయాలన్నిటి పై స్పష్టత రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :