“ఆర్ ఆర్ ఆర్”నే బెటర్ అంటున్న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్

Published on May 21, 2019 9:29 am IST

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్, చరణ్ ఎన్టీఆర్ ల ముల్టీస్టారర్ కి “ఆర్ ఆర్ ఆర్” నే ఉత్తమ టైటిల్ అని రాజమౌళి తో చెప్పారంట. ఈ మధ్య రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్ “కి మంచి టైటిల్ ని పంపమని ఓ కాంటెస్ట్ నిర్వహించగా వచ్చిన వందలాది టైటిల్స్ లో “రామ రావణ రాజ్యం”, “రఘుపతి రాఘవ రాజారామ్” అనే పేర్లు పరిశీలనలోకి తీసుకున్నారంట. కరణ్ మాత్రం ప్రస్తుత జనరేషన్ యూత్ కి ఇలాంటి పొడవాటి టైటిల్స్ కంటే కూడా “ఆర్ ఆర్ ఆర్” టైటిల్ నే బాగా చేరుకుంటుంది అని చెప్పారంట. దానితో పాటు “ఆర్ ఆర్ ఆర్ ” ఇండియాలో వివిధ భాషలలో విడుదల కానున్న ఫ్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇంగీష్ అక్షరాల టైటిల్ బాగుంటుందని సలహా ఇచ్చారంట. దీనికి సంబంధించి ఓ కథనాన్ని ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.

హిందీలో బాహుబలి సిరీస్ ని విడుదల చేసిన కరణ్ ఆ మూవీస్ రికార్డ్ వసూళ్లు చేయడం లో కీలక పాత్ర వహించారు. అలాంటి కరణ్ సలహా ఇవ్వడంతో సందిగ్ధంలో పడ్డాడంట జక్కన్న. మరి చూడాలి కరణ్ సలహా పాటిస్తాడోలేదో.

సంబంధిత సమాచారం :

More