
నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ చిత్రం ‘ఆరమ్’ తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో రిలీజ్ కానుంది. గోపి నైనర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఐఏఎస్ పాత్ర చుట్టూ నడిచే ఈ సినిమాను కలెక్టర్లకు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
ఈరోజు సాయంత్రం ప్రదర్శించనున్న ఈ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లను ఆహ్వానించారు. నెల్లూరులోని సిరి మల్టీప్లెక్స్ లో సాయంత్రం 7 గంటలకు, కాకినాడలోని చాణుక్య థియేటర్లో 6 గంటల 15 నిముషాలకు ఈ షోలు వేయనున్నారు. మంచి సామాజిక సందేశంతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానుంది.

