యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో కార్తి కొత్త చిత్రం !

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో కార్తి కొత్త చిత్రం !

Published on Dec 6, 2018 7:18 PM IST

Karthi

‘కడై కుట్టి సింగం (చినబాబు ) , తీరన్ అదిగారం ఒండ్రు (ఖాకి)’ చిత్రాలతో వరుస విజయాలు అందుకొని ఫుల్ జోష్ లో వున్నాడు హీరో కార్తి. ఆయన తాజాగా ‘దేవ్’ అనే అడ్వెంచరస్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈచిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈచిత్రం తరువాత కార్తి ‘మానగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ లో నటించనున్నాడట.

డ్రీం వారియార్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు