సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సర్దార్ 2’.. గ్రాండ్ రిలీజ్ కి ఆల్ సెట్!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సర్దార్ 2’.. గ్రాండ్ రిలీజ్ కి ఆల్ సెట్!

Published on Sep 3, 2026 9:08 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో ప్రముఖ హీరో తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా దగ్గరైన హీరో కార్తీ కూడా ఒకరు. కార్తీ హీరోగా నటించిన రీసెంట్ సినిమాలు వరుస ఫెయిల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అన్ని వైఫల్యాలు వచ్చినప్పటికీ కార్తీ నెక్స్ట్ సినిమాపై మాత్రం భారీ హైప్ సెట్ అయ్యింది. మరి ఆ చిత్రమే సర్దార్ 2. దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ పనులు పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. సెన్సార్ యూనిట్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేశారు. సో అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఈ చిత్రం అలరించేందుకు సిద్ధం అవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా నటించగా మాళవిక మోహనన్, రజిషా విజయన్ తదితరులు నటిస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు