హీరోగా పరిచయమవుతున్న కార్తిక్ జయంతి.. ‘రాయవలస’ రిలీజ్ డేట్ లాక్!

హీరోగా పరిచయమవుతున్న కార్తిక్ జయంతి.. ‘రాయవలస’ రిలీజ్ డేట్ లాక్!

Published on Sep 25, 2026 8:00 AM IST

కార్తిక్ జయంతి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రాయవలస’ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్రబృందం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది.

రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రేసన్ ప్రొడక్షన్స్ (RaysuN Productions) పతాకంపై గోపీ కృష్ణ జె నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీష నులు కథానాయికగా నటిస్తుండగా, అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధ్ రావు, సుహాస్, ‘కంచరపాలెం’ రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి రాఖీ ఎ కథ, మాటలు అందించగా, అర్జున్ బాలా సంగీతం సమకూర్చారు. పూర్ణ చారి, కార్తిక్ జయంతి, తరుణ్ సైదులు రాసిన పాటలను రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రమ్య బెహరా తదితరులు పాడారు. వీఆర్‌కే నాయుడు (కిట్టు) సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు