‘కార్తికేయ 2’ షూట్ కి సర్వం సిద్ధం

Published on Feb 29, 2020 12:05 am IST

యంగ్ హీరో నిఖిల్ చేసిన చిత్రాలలో కార్తికేయ సూపర్ హిట్ గా నిలవడంతో పాటు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడు చందూ మొండేటి సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా, స్వాతి హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కనుంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా చిత్ర యూనిట్ రెగ్యులర్ షూట్ కి రెడీ అయ్యారు.

దర్శకుడు చందు మొండేటి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడంతో షూట్ కి సిద్ధమయ్యారు. వచ్చేనెల 2నుండి ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ తిరుపతి వేదికగా ప్రారంభిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల, టీ జి విశ్వ ప్రసాద్ ఈ చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిరవధికంగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :