టీజర్: “గుణం 369”-రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్

Published on Jun 17, 2019 12:38 pm IST

‘ఆర్ ఎస్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా,అనఘా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ “గుణ 369”. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల,తిరుమల రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు.

దాదాపు ఒక నిమిషం నిడివిగల ఈ టీజర్ రొమాంటిక్ సన్నివేశాలు,యాక్షన్ ఎపిసోడ్స్ తో బ్యాలన్స్డ్ గా చక్కగా కట్ చేశారు. నచ్చిన అమ్మాయి మనసుని గెలుచుకోవడానికి తాపత్రపడే యంగ్ ఎంప్లాయ్ గా కార్తీక్ పాత్ర ఉంది. హీరోయిన్ అనఘా ట్రెడిషనల్ క్యూట్ గర్ల్ లుక్ లో చాలా అందంగా ఉంది.

టీజర్ మొదట్లోనే “మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం పర్లేదు,కానీ పక్కనోడి జీవితానికి ఏం జరగకూడదు” అని సాయి కుమార్ వాయిస్ ఓవర్ డైలాగ్ తో ఈ మూవీ థీమ్ పై కొంచెం అవగాహన వస్తుంది. మరి ఈ కథలో ఎవరు చేసిన తప్పులకు ఎవరి జీవితం ఇబ్బందుల్లో పడుతుందో అనేది తెలియాలి. రొమాంటిక్ సన్నివేశాలలో లవర్ బాయ్ గా,యాక్షన్ సీన్స్ లో వైలెంట్ గా కార్తీక్ నటన చాలా బాగుంది. టీజర్ చూస్తుంటే ఈ సారి కార్తికేయ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More