అజిత్ సినిమా షూటింగ్లో తెలుగు యంగ్ హీరో

Published on Sep 23, 2020 10:08 pm IST


తమిళ స్టార్ హీరో అజిత్ చేస్తున్న చిత్రం ‘వాలిమై’. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఈరోజే చెన్నైలో రీస్టార్ట్ అయింది. దీంతో అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షూటింగ్లో అజిత్ పాల్గొనట్లేదు. ఆయన సెట్స్ మీదకి రావడానికి ఇంకా టైమ్ ఉంది. అందుకే ఇతర తారాగణం మీద చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రీకరణలో తెలుగు యంగ్ హీరో కార్తికేయ పాల్గొంటున్నారు.

కార్తికేయ ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాఋ. నటుడిగా ఇది ఆయనకు ఒక గొప్ప అవకాశమనే అనాలి. కార్తికేయ సైతం అజిత్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటిస్తుండటంతో సూపర్ హ్యాపీగా ఉన్నాడు. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అజిత్ సరసన హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More