కార్తికేయ సినిమా అఖండ ప్రజాదరణ పొందుతూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించాడు. స్వాతి, నిఖిల్ లు ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఒక గుడి రహస్యాన్ని చేధించే నేపధ్యంలో తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా గనుక రెండవ వారం కూడా మంచి వసూళ్ళను సాధిస్తుంది
సరికొత్త కధ, ఫాస్ట్ నెరేషన్, మంచి సస్పెన్స్ ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి. స్వామి రారా తరువాత నిఖిల్ కి మరో హిట్ లభించింది. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచి సినిమాను మరో మెట్టు ఎక్కించడంలో తోడ్పడింది


