సిక్స్ ప్యాక్ లుక్ లో కేక పుట్టిస్తున్న యంగ్ హీరో

Published on May 27, 2020 10:12 am IST

యంగ్ హీరో కార్తికేయ సిక్స్ ప్యాక్ లుక్ కేక పుట్టిస్తున్నాడు. చొక్కాలేకుండా తన కర్వ్డ్ బాడీతో అమ్మాయిల గుండెల్లో హీట్ పుట్టిస్తున్నాడు. బేర్ బాడీతో ఉన్న కార్తికేయ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కార్తికేయ చావుకబురు చల్లగా అనే మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది. బస్తీ మాస్ కుర్రాడిగా ఈ మూవీలో కార్తికేయ కనిపించనున్నాడని అర్థం అవుతుంది.

గత ఏడాది కార్తికేయ ఏకంగా హిప్పీ, గుణ 369, 90 ఎమ్ ఎల్ అనే మూడు చిత్రాలు విడుదల చేశాడు. వాటిలో గుణ369 మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కార్తికేయకు నటుడిగా మంచి పేరుతెచ్చింది. ఇక 90 ఎం ఎల్ అనే మరో మూవీ కార్తికేయ నుండి రావడం జరిగింది. థియేటర్స్ లో అంత ఆదరణ దక్కించుకోని 90ఎం ఎల్ బుల్లి తెరపై అద్భుత రేటింగ్ సాధించింది. అయితే ఆర్ ఎక్స్ 100 తరువాత ఆ స్థాయి హిట్ కార్తికేయ అందుకోలేదు.

సంబంధిత సమాచారం :

More