చిరంజీవి మెస్సేజ్ చూసి స్టన్ అయిన యంగ్ హీరో.

Published on Jun 2, 2020 9:35 am IST

యంగ్ హీరో కార్తికేయ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ అవార్డు వేడుకలో చిరంజీవి పాటకు స్టెప్స్ వేయడమే కాకుండా చిరు పట్ల తనకున్న ప్రేమను వేదికపై తెలియపరచి ఆయన చేత కంటతడి పెట్టింశారు. కాగా ఈ యంగ్ హీరో, చిరు చేసిన మెస్సేజ్ చూసి స్టన్ అయ్యారట. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో కార్తికేయ తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శిస్తూ కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఆ ఫోటోలను చూసిన చిరంజీవి కార్తికేయ కు ”వాట్ ఏ ట్రాన్స్పర్మేషన్” అని మెస్సేజ్ చేశారట.

మెగాస్టార్ లాంటి హీరో నుండి వచ్చిన అలాంటి అభినందన పూర్వక మెస్సేజ్ చూసిన కార్తికేయ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయట. ప్రస్తుతం కార్తికేయ చావు కబురు చల్లగా అనే చిత్రంలో నటిస్తున్నారు. డార్క్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More