కార్తి నటించిన ‘బిర్యాని’ సినిమా సెప్టెంబర్ 6న తమిళ మరియు తెలుగు భాషలలో విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమాలో కార్తి సరసన హన్సిక నటిస్తుంది. ప్రేమ్ జీ, మాండీ థాకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఈ జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో చాల భాగాన్ని హైదరాబాద్ మరియు చెన్నైలలో తీసారు. ‘శకుని’, ‘బాడ్ బాయ్’ సినిమాలు పరాజయంకావడంతో ఈ సినిమా కార్తికు ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. ఒక రాత్రి బిర్యానీ కోసం బయటకు వెళ్ళిన వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న సన్నివేశాలను యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ విధానంలో తెరకెక్కించారు. వెంకట్ ప్రభు ఇప్పటికే ‘చెన్నై – 28’, ‘సరోజ’ ‘గోవా’ మరియు ‘మంకత్త’ వంటి సినిమాలను తీసాడు. ‘మంకత్త’ సినిమా తెలుగులో ‘గ్యంబ్లర్’గా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కార్తి మరి తెలుగులో తన పరాజయాల బాటనుండి బయటపడతాడేమో చూడాలి.
సెప్టెంబర్ 6న విడుదలకానున్న బిర్యాని
సెప్టెంబర్ 6న విడుదలకానున్న బిర్యాని
Published on Jul 22, 2013 8:45 PM IST
సంబంధిత సమాచారం
- కార్తీ సినిమా కోసం మరో డైరెక్టర్.. అయితే..!
- సాయి పల్లవి మూవీ ఫ్లాప్.. ఆ స్టార్ హీరో ఒప్పుకున్నాడట..!
- విడాకుల బాటలో ‘విశ్వంభర’ బ్యూటీ..?
- అక్షయ్ కుమార్‌తో దిల్ రాజు సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..!
- ‘రామాయణ’ షూటింగ్లో జాయిన్ అయిన రకుల్.. ఆ పాత్ర కోసమే..!
- కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో లోకేష్ ‘DC’ ట్రైలర్.. ఎప్పుడంటే..?
- ‘పెద్ది’ రెండు వెర్షన్లూ ‘ధురంధర్’ మేకర్స్ తోనే.!
- సూర్య ‘కరుప్పు’ చిత్రానికి సీఎం విజయ్ బూస్ట్..!
- నైజాంలో ‘పెద్ది’కి షాక్.. టికెట్ రేట్లు పెంచబోమంటున్న ఎగ్జిబిటర్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఇద్దరు..?
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!
- ‘పెద్ది’ మాస్ జాతర మొదలు.. ట్రైలర్ డేట్ ఫిక్స్!


