‘ఆవారా’ డైరెక్టర్ తో కార్తీ మరో సినిమా

‘ఆవారా’ డైరెక్టర్ తో కార్తీ మరో సినిమా

Published on Dec 8, 2014 11:36 AM IST

karthi_lingusamy
తమిళ స్టార్ హీరో కార్తీ మరియు తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామి… ఈ రెండు పేర్లు స్వతహాగానే తమిళ వారికి చెందినవే అయినా వారి సినిమాలు అన్నీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో వాళ్ళకి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఆవారా’. 2010లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ అయ్యింది.

దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. లింగుసామి చెప్పిన స్టొరీ లైన్ కి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లింగుసామి ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా 2015 లో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కూడా ‘ఆవారా’లా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. ఇది కాకుండా లింగుసామి ‘పందెం కోడి’ సినిమా సీక్వెల్ కి కూడా కథ రాస్తున్నాడు.

కార్తీ ప్రస్తుతం ‘కోంబన్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక కార్తీ తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేయనున్న వంశీ పైడిపల్లి సినిమా టీంతో జాయిన్ అవుతాడు. ఈ సినిమాలో కార్తీతో పాటు నాగార్జున కూడా మరో హీరోగా నటించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు