చలువజోడు, తెల్లపంచెలో “గుణ 369” ఫస్ట్ లుక్ కేక

Published on May 29, 2019 11:45 am IST

మొదటి సినిమా “ఆర్ ఎక్స్100” లాంటి యూత్ ఫుల్ మూవీలో నటించిన కార్తికేయ ఆ చిత్ర ఘనవిజయం తో యూత్ లో బాగానే రిజిస్టర్ అయ్యాడు. ప్రేయసి చేతిలో మోసపోయిన ప్రేమికుడిగా కార్తికేయ నటనకు మంచి మార్కులే వేశారు తెలుగు ప్రేక్షకులు. “హిప్పీ” అనే ఓ రొమాంటిక్ ఎంటర్టైన్ లో చేస్తున్న ఈ యంగ్ హీరో “గుణ 369” అనే మరో క్రేజీ మూవీని కూడా లైన్ లో పెట్టేశాడు .

కళ్ళ జోడు,ఎర్ర చొక్కా,తెల్ల పంచలో బీచ్లో నడిచొస్తున్న కార్తీకేయ “గుణ369” మూవీ ఫస్ట్ లుక్ చాలాబాగుంది. కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ మూవీని దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్నారని సమాచారం. కార్తీకేయ కి జోడిగా అనాఘా చేస్తున్న, ఈ మూవీకి చైతన్ మ్యూజిక్ అందిస్తుండగా, అనిల్ ,తిరుమలరెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More