ఉగాదిని బాగా క్యాష్ చేసుకున్న ‘కాటమరాయుడు’ !

30th, March 2017 - 09:00:43 AM


పవన్ కల్యాణ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ ముందు సత్తా చూపిస్తోంది. విడుదలైన రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం మొదటి నాలుగు రోజులకు కలిపి ఏపి, తెలంగాణల్లో రూ. 37.6 కోట్లు వసూలు చేసింది. ఇక నిన్న ఉగాది పండుగరోజు ఆ కలెక్షన్లు మరింత భారీగా పెరిగాయి. అన్ని వర్గాల ఉద్యోగులకు సెలవు కావడం, కుటుంబ ప్రేక్షకులు సినిమాకు పోటెత్తడం, థియేటర్లలో మరో చెప్పుకోదగిన సినిమా లేకపోవడంతో ‘కాటమరాయుడు’ వసూళ్ళలో మంచి గ్రోత్ కనిపించింది.

నిన్నటి రోజు వసూళ్ళతో కలిపి ఈ చిత్రం యొక్క తెలుగు రాష్ట్రాల మొత్తం కలెక్షన్స్ రూ. 50 కోట్ల దగ్గరైనట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఓవర్సీస్లో సైతం ఈ సినిమా మిలియన్ మార్కును అవలీలగా అందుకుంది. పవన్ సరికొత్త లుక్ లో కనిపించడం, అభిమానుల అభిరుచికి అనుగుణంగా కథ ఉండటంతో చిత్రం విజయవంతమవుతోంది. ‘గోపాల గోపాల’ ఫేమ్ డాలి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన హీరోయిన్ గా నటించింది.