గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ వ్యయంతో నిర్మిస్తున్న 3డి సినిమా ‘రుద్రమదేవి’. ఈ పీరియడ్ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకి భార్య పాత్రలో కేథరిన్ కనిపించనుంది. అలాగే గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్లో షూటింగ్ జరుగుతోంది.
మాకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో గోన గన్నారెడ్డి, అతని భార్య కథానుసారం ఈ సినిమాలో చనిపోతారు. ప్రస్తుతం అల్లు అర్జున్ – కేథరిన్ లపై వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, హంసా నందిని, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.


