కత్తి మహేష్ సేఫ్.. అవన్ని పుకార్లేనట!

Published on Jun 29, 2021 2:28 am IST


ప్రముఖ నటుడు, మూవీ క్రిటిక్ కత్తి మహేశ్‌కి మొన్న నెలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్‌కి తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతుంది. అయితే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేశ్ గురుంచి సానుభూతి తెలిపి త్వరగా కోలుకోవాలని కోరుకోవాల్సిందిపోయి కొందరు ఆయన చనిపోవడం ఖాయమని, కంటి చూపు పోయిందని రకరకాల పుకార్లు సృష్టిస్తున్నారు.

అయితే తాజాగా కొంతమంది దళిత నాయకులు, సన్నిహితులు చెన్నై వెళ్లి కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి గురుంచి తెలుసుకున్నారు. కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లను ఆయన సన్నిహితులు ఖండించారు. కత్తి మహేష్ చాలా వరకూ కోలుకున్నారని, తల నుదిటి భాగంలో ఎముక విరిగిందని తాజాగా దానికి శస్త్ర చికిత్స చేశారని, కంటికి బలమైన గాయం కావడంతో సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, త్వరలోనో ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి హైదరాబాద్‌కి రాబోతున్నట్టు వారు తెలియజేశారు. సో మనందరం కూడా మానవత్వ ధోరణితో ఆలోచించి కత్తి మహేశ్ త్వరగా కోలుకుని సేఫ్‌గా ఇంటికి రావాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :