సహజీవనం చేయాల్సివస్తే తనతో చేస్తా అంటున్న కత్రినా కైఫ్.

Published on Jun 2, 2019 10:30 pm IST

ప్రస్తుతం కత్రినా ఖైఫ్ సల్మాన్ ఖాన్ తో చేసిన “భరత్” మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. ఈద్ సంధర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఐతే ప్రమోషన్స్ లో భాగంగా ఓ విలేకరి అడిగిన ఓ వింత ప్రశ్నకి కత్రినా ఆసక్తికర సమాధానం చెప్పారు. ఆడవారితో సహజీవనం చేయాల్సివస్తే మీరు ఎవరితో చేయడనికి ఇష్టపడతారు ? అని అడిగిన ప్రశ్నకు కత్రినా తనకు అలా జీవించాల్సివస్తే కరీనా కపూర్ ని జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటానంటూ తడుముకోకుండా సమాధానం చెప్పింది.

ఇంకా మాట్లాడుతూ కరీనా చాలా ధైర్యం కలిగిన అందమైన నటి, ఆమెతో వర్క్ చేయడం నాకు చాలా ఆహ్లాదంగా ఉంటుందంటూ, కరీనాను పొగడ్తలతో ముంచెత్తింది. పాశ్చాత్య దేశాలలో సెలెబ్రిటీలు ఈ ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ చేయగా, మనదేశంలో కూడా ఇలాంటి రిలేషన్స్ ని చట్టబద్దం చేసిన సంగతి తెలిసిందే. ఐతే సంప్రదాయవాదులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నతరుణంలో కత్రినా వ్యాఖ్యలు ఎన్నివివాదాలకు దారితీయనున్నాయో…?

సంబంధిత సమాచారం :

More