‘స్పిరిట్’లో కత్రినా కైఫ్‌ పాత్ర అదేనా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే సుమారు 40 శాతం పూర్తయినట్లు సమాచారం. ఐతే, బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర కోసం కత్రినా కైఫ్‌ను సంప్రదించారు. ఇక ఈ పాత్రను చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె ఈ ప్రాజెక్ట్‌ లో నటిస్తే.. 11 ఏళ్ల తర్వాత ‘స్పిరిట్’ చిత్రం ద్వారా కత్రినా కైఫ్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చినట్లవుతుంది.

అన్నట్టు ఇంతకీ కత్రినా కైఫ్‌ పాత్ర ఏమిటంటే.. ఆమె పోలీస్ అధికారిగా కనిపించబోతుందట. కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది.ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.

Exit mobile version