‘కవచం’ టీజర్ టైం డేట్ ఫిక్స్ !

Kavacham1

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కవచం’. తాజాగా ఈ చిత్రం యొక్క టీజర్ ను రేపు (నవంబర్ 12) మూడు గంటల పంతొమ్మింది నిముషాలకు విడుదల అవ్వబోతుందని చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ‘కవచం’ 5వ చిత్రం కావడం విశేషం.

కాగా ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సాహో చిత్రంలో విలిన్ గా నటిస్తోన్న నీల్ నితిన్ ముఖేష్, ఈ చిత్రంలో కూడా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలకానుంది.

Exit mobile version