
గతంలో ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈసారి మాత్రం కేసీఆర్ ను పొగుడుతూ.. ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచేలా ట్విట్టర్లో తన భావాలను వెల్లడించారు.
‘గాంధీ, బాల్ థాకరే కన్నా కేసీఆర్ పనితీరు అద్బుతంగా ఉంది. కేసీఆర్ ను చూసి చంద్రబాబు నాయుడు చాలా నేర్చుకోవాలి. ఈ విషయంలో ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు. నేను తెలంగాణలో పుట్టాను. ఇక్కడే పెరిగాను. నా హృదయం తెలంగాణతోనే ఉంది’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.


