త్వరలో మీకు ఓ సర్‌ ప్రైజ్‌ – వెంకటేష్

Published on Aug 14, 2018 12:56 pm IST

విక్టరీ వెంకటేష్‌ హీరోగా కెరీర్ ను మొదలు పెట్టి ఈ రోజుతోటి 32 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఆయన విశేష అభిమానులను సంపాదించుకున్నారు. కాగా ఈ సందర్భంగా వెంకీ తనను ఇన్నేళ్లు ఆదరించిన అభిమానులకు సహకరించిన చిత్రబృందాలకు తన పేస్ బుక్ పేజీ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు.

‘1986 ఆగస్టు 14న కలియుగ పాండవులు చిత్రం విడుదలతో నాలోని నటుడు జన్మించాడు. 32 సంవత్సరాలుగా మీ సహాయసహకారాలతో ప్రేమానురాగాలతో నాకు బాసటగా నిలవటం నా అదృష్టం. నా సినీ జీవితంలో మీరు చూపించిన అభిమానం, మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మీకు, నేను మరింత దగ్గరయ్యేందుకు మరో అడుగు ముందుకు వేయబోతున్నాను. త్వరలో మీకు ఓ సర్‌ప్రైజ్‌’ అంటూ ఆయన పోస్ట్‌ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More