టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పెంగ్విన్ చిత్రంలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దర్శకుడిగా ఈశ్వర్ కార్తీక్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
వైవిధ్యంగా పెంగ్విన్ అనే ఒక పక్షి పేరును టైటిల్ గా పెట్టిన చిత్ర యూనిట్ డార్క్ షేడ్ లో గర్భవతిగా ఉన్న కీర్తి సురేష్ ఫోటోతో కూడిన పోస్టర్ విడుదల చేశారు. దీనితో కీర్తి ఈ చిత్రంలో ప్రెగ్నెంట్ విమెన్ గా ఛాలెంజింగ్ రోల్ చేస్తుందని అర్థం అవుతుంది. ఒక డిఫరెంట్ కథాంశతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే మంచి ప్రచారం దక్కించుకుంది. ఈ మూవీతో పాటు, నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఒక మూవీ, నరేంద్రనాధ్ దర్శకుడిగా ‘మిస్ ఇండియా’ అనే మరో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.
