విజయ్ సినిమాలో ‘కీర్తి సురేష్’ ఫిక్స్ అట ?

Published on Jul 18, 2021 11:50 pm IST

మహానటి ఫేమ్ ‘కీర్తి సురేష్’ ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో నయనతార, మీనాతో కలిసి కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా కీర్తి సురేష్ నటించే ఛాన్స్ వచ్చిందని గతంలోనే వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కీర్తి నిజంగానే విజయ్ సినిమాలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కీర్తి, విజయ్ తో కలిసి నటించింది. విజయ్ తదుపరి చిత్రంలో కీర్తి సురేష్ నటించబోతుంది. ఐతే, విజయ్ నెక్స్ట్ మూవీ లోకేష్ కనగరాజ్ తో లేక వంశీ పైడిపల్లితో ఉండే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ చేసే నెక్స్ట్ సినిమాల్లో ఒక సినిమాలో ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. సర్కారులో మహేష్ సరసన, తమిళంలో విజయ్ సరసన ఒకేసారి కీర్తి నటిస్తే.. ఆమె స్టార్ డమ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :