ఆ సెక్వెల్ లో కుర్ర హీరో సరసన కీర్తి సురేష్ ?

Published on Jun 22, 2019 6:22 pm IST

కింగ్ నాగార్జున,రమ్య కృష్ణ,లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి 2016 సంక్రాతి కానుకగా విడుదలైన “సోగ్గాడే చిన్నినాయనా” మంచి విజయాన్ని అందుకొంది. నాగార్జున కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “సోగ్గాడే చిన్నినాయనా” మూవీ నిలిచింది. ఐతే నాగార్జున ఈ విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ గా “బంగార్రాజు” అనే టైటిల్ తో ఓ మూవీని అదే దర్శకుడితో చేయాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని సమాచారం. నాగ్ కుటుంబంలోని నటులందరూ కనిపించేలా ‘మనం’ తరహా కథను దర్శకుడు “కళ్యాణ్ కృష్ణ” సిద్ధం చేస్తున్నారట.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మూవీలో నాగ చైతన్య సరసన నటింపజేసేందుకు కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారట. ఐతే దీనిపై ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.మన్మధుడు సినిమాకి కొనసాగింపుగా నాగార్జున ,రకుల్ ప్రధాన పాత్రలలో వస్తున్న “మన్మధుడు2” లో కీర్తి సురేష్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం ఆగస్టు12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More