మన్మథుడితో మహానటి !

Published on Jun 4, 2019 10:22 pm IST

‘మహానటి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఆ తర్వాత తెలుగు పరిశ్రమ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈమధ్యే ఒక తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిన ఆమె ఇప్పుడు మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అదే ‘మన్మథుడు 2’. సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక కీ రోల్ చేస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో ఆమె పాల్గొంటోంది. ఇప్పటికే ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయికగా సమంత ఒక కీలక పాత్రలో నటిస్తుండగా వీరికి తోడు కీర్తి సురేష్ కూడా యాడ్ అవడంతో సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2020 కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే 90 శాతం షూట్ పూర్తవగా సినిమా అనుకున్నట్టే వచ్చిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :

More