టీజర్ తో ఆకట్టుకుంటున్న “గుడ్ లక్ సఖి”.!

Published on Aug 15, 2020 11:20 am IST

ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఎంతగానో ఆదరణ పొందుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మన హీరోయిన్స్ కూడా పలు ఛాలెంజింగ్ రోల్స్ చేసి తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధపడుతున్నారు. అలా “మహానటి” చిత్రంతో అద్భుతమైన పెర్ఫామెన్స్ ను కనబర్చి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తనకంటూ ఒక చిరునామాను ఏర్పర్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. అక్కడ నుంచి చాలా చిత్రాలను చేసిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మరో చిత్రంతో రావడానికి సిద్ధంగా ఉంది. అదే “గుడ్ లక్ సఖి”.

మొత్తం మూడు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబోలో రానున్న ఈ చిత్రం తాలూకా తెలుగు టీజర్ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పుడు విడుదలైంది. ఈ టీజర్ ను గమనించినట్టైతే సినిమాపై మంచి అంచనాలు ఏర్పర్చుకోవచ్చనిపిస్తుంది. ఓ మారు మూల ప్రాంతానికి చెందిన ఓ అల్లరి అమ్మాయిలోని ప్రతిభను వెలికి తీసి జాతీయ స్థాయి రైఫెల్ షూటింగ్ లో పాల్గొనేలా తీర్చిదిద్దిన ఈ సినిమా టీజర్ చూడడానికి ఆహ్లాదంగా ఉంది.

ఆ కోచ్ గా జగపతి బాబు కనిపించగా ఆ ఊరిలో నాటకాలు వేసే యువకునిగా ఆది పినిశెట్టి కనిపించారు.ఇక కీర్తి అయితే అల్లరి అమ్మాయిగా తన ఇన్నోసెన్స్ తో ఆకట్టుంది. దీనితో పాటుగా దేవి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే చిత్రాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే అనిపిస్తాయి. అలా ఈ చిత్రం కూడా ఆకట్టుకునేలానే అనిపిస్తుంది. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో చూడాలి. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ చంద్ర పదిరి మరియు శ్రావ్య వర్మలు సంయుక్తంగా వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :