సౌత్ సినిమా దగ్గర తన కొన్ని సినిమాలతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్. అయితే ఆమె తెలుగు, తమిళ్ ఇతర భాషల్లో నటించింది. అక్కడ నుంచి హిందీ సినిమాకి కూడా వెళ్ళింది. హిందీలో బేబీ జాన్ అనే సాలిడ్ యాక్షన్ డ్రామాతో ఒక ఊహించని గ్లామరస్ ఎంట్రీని ఆమె ఇచ్చింది. కానీ తీరా సీన్ కట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఇక ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ కి హిందీలో ఆఫర్స్ ఉండవా అనుకునే వారికి ఆమె రెండో సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అయ్యింది. టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘రాఫ్తార్’ ఇప్పుడు రిలీజ్ సిద్ధం అయ్యినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
దర్శకుడు ఆదిత్య నింబల్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది జూలై 24న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమాతో అయినా కీర్తి సురేష్ హిందీ సినిమాలో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో కిల్ బ్యూటీ తన్యా మణిక్తలా కూడా కీలక పాత్రలో నటిస్తుండగా అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ మరియు ఏ కంపా ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.
