కీర్తి మోస్ట్ అవైటెడ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోనే.!

Published on Oct 24, 2020 10:37 am IST

ఇప్పుడు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు గాను మొదటి రేస్ లో నిలుస్తున్న స్టార్ హీరోయిన్స్ పేర్లలో కీర్తి సురేష్ ఒకరు. “మహానటి”తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ అక్కడ నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. అయితే అక్కడ నుంచి ఎన్నో చిత్రాల్లో కనిపించిన కీర్తి సురేష్ పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కనిపించింది.

అయితే ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో నటించిన చిత్రాలు ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. వాటిలో గత కొంత కాలం నుంచి టాక్ వినిపిస్తున్న “మిస్ ఇండియా” చిత్రం కూడా ఒకటి. నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హిట్ నిర్మాత మహేష్ కోనేరు నిర్మాణం అందించారు.

అయితే ఈ చిత్రం అప్పుడు వినిపించిన టాక్ ప్రకారం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ తో రెడీ అవుతున్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో డైరక్ట్ డిజిటల్ రిలీజ్ కానుంది అని ఖరారు చేసేసింది. అయితే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ కానున్నట్టు టాక్. మరి ఇప్పుడు 11 గంటలకు రానున్న ట్రైలర్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More