మరో లేడీ ఓరియెంటెడ్ తో ‘టాలెంటెడ్ హీరోయిన్’ !

Published on Jan 10, 2019 6:30 pm IST

సినీమాల్లో హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యతే లేకుండా పోతుందని చాలా కాలంగా విమర్శలు వింటూనే ఉన్నాం. నిజంగానే కేవలం రెండు రొమాంటిక్ సీన్లు, నాలుగు పాటల వరకే హీరోయిన్లు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం సినిమాల్లో ఉంది. అయితే అప్పుడప్పుడు అరుంధతి లాంటి సినిమాలు హీరోయిన్లలోని నటన చాతుర్యాన్ని బయటపెడుతుంటాయి. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా అనేంతలా నటించి తెలుగు వారి మనసులు గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.

కాగా నేను శైలజాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తి కొన్నాళ్లపాటు హీరోలతో జత కట్టే పాత్రలే చేసినా.. ఇప్పుడు ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి రెడీ అంటోంది. తాజాగా కీర్తి సురేష్ ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రాకంగా దాడుల జరుగుతాయి. ఇప్పుడు ఈ చిత్రంలో ఆ దాడులని విశ్లేషాత్మకంగా చూపించనున్నారు. కాగా ఈ సినిమాకి నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More