లేడీ ఓరియెంటెడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ !

లేడీ ఓరియెంటెడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ !

Published on Dec 8, 2018 3:12 PM IST

చాలా కాలంగా సినీమాల్లో హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యతే లేకుండా పోతుంది, కేవలం రెండు రొమాంటిక్ సీన్లు, నాలుగు పాటల వరకే హీరోయిన్లు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం సినిమాల్లో ఉంది. అయితే అప్పుడప్పుడు అరుంధతి లాంటి సినిమాలు హీరోయిన్లలోని నటన చాతుర్యాన్ని బయటపెడుతుంటాయి. మహానటి సినిమా కూడా ఆ కోవకే చెందుతుంది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా అనేంతలా నటించి తెలుగు వారి మనసులు గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.

కాగా నేను శైలజాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తి తర్వాత నేను లోకల్, మహానటి సినిమాల ద్వారా మరింత దగ్గరైంది. కీర్తి నటించిన పందెం కొడి 2, సర్కార్ చిత్రాలు తమిళ్ లో భారీ విజయాలు సాధించాయి, తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి వసూల్లు రాబట్టాయి. కొన్నాళ్లపాటు హీరోలతో జత కట్టే పాత్రలే చేసిన కీర్తి, ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి రెడీ అంటోంది.

తాజాగా కీర్తి సురేష్ ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. లేడీ ఓరియెంటెడ్ కథతో ఆ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరు అన్నది ఇంకా ఫైనలైజ్ కాలేదు. దర్శకుడు ఎవరన్నది, ఇతరత్రా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఏది ఏమైనా కీర్తి సురేష్ ఓకే చేసిందంటే ఆ కథలో మంచి కంటెంట్ ఉంటుందన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు