ప్రభాస్ సైన్ చేసిన భారీ బడ్జెట్ పిరియాడికల్ మూవీ ‘ఆదిపురుష్’ కొన్ని రోజుల క్రితం ముంబైలో అట్టహాసంగా మొదలైంది. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ ప్రాజెక్ట్ ఇదే. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. అలాగే మరొక స్టార్ నటుడు వికెకె కౌశల్ రాముడి సోదరుడు లక్ష్మణుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
అన్ని పాత్రల మీద ఒక్కొక్కటిగా క్లారిటీ వస్తోంది కానీ కీలకమైన సీత పాత్ర మీద మాత్రం ఇంతవరకు అఫీషియల్ ప్రకటన ఏదీ లేదు. అయితే ఫిలిం నగర్ టాక్ మేరకు ఇందులో కీర్తి సురేష్ సీతగా కనిపిస్తుందని తెలుస్తోంది. ‘మహానటి’ చిత్రంతో కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును దక్కించుకుంది. అందుకే ఆమె అయితే సీత పాత్రకు సరిగ్గా సరిపోతుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. మొదట్లో అందరూ సీత పాత్ర చేసే అవకాశాన్ని బాలీవుడ్ హీరోయిన్ ఎవర్తైనా కొట్టేస్తారని అనుకున్నారు. కానీ ఈలోపే ఆ ఆఫర్ కీరికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈవార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.


