కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపికైన ఒకే ఒక తెలుగు చిత్రం “ఎడారి వర్షం”

కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపికైన ఒకే ఒక తెలుగు చిత్రం “ఎడారి వర్షం”

Published on Feb 13, 2012 8:00 AM IST


ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా- కేరళం నిర్వహించే ‘సైన్స్’ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల ఫెస్టివల్ లోని ఫోకస్ సెక్షన్లో ఎంపికైన నలబై రెండు చిత్రాలలోని ఫోకస్ సెక్షన్లో స్థానం సంపాదించుకున్న ఏకైన తెలుగు చిత్రం “ఎడారివర్షం”. తెలుగు ఇండిపెండెంట్ సినిమా బ్యానర్ పై కోఅపరేటివ్ పధ్దతిలో ఒక ఫేస్ బుక్ గ్రూపు నుంచి కొందరు ఔత్సాహికుల కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుండీ కేరళలోని పాలక్కాడ్ లో ప్రారంభమయ్యే ఈ అంతర్జాయచిత్రోత్సవంలో ప్రదర్శింపబడుతుంది.

ప్రముఖ కవి,రచయిత బాలగంగాధర్ తిలక్ “ఊరి చివర ఇల్లు” కథ ప్రేరణతో నిర్మించిన ఈ చిత్రానికి కత్తి మహేష్ కుమార్ దర్శకత్వం వహించారు. రఘు కుంచె, స్వప్న, ప్రమీలారాణి నటించారు. కెమెరా కమలాకర్, సంగీతం రాజశేఖర శర్మ అందించిన ఈ చిత్రాన్ని దాదాపు ముప్పైమంది కలిసి నిర్మించారు. ఇప్పటికే పరిశ్రమ గుర్తింపుని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు, ఈ అంతర్జాతీయస్థాయి చిత్రోత్సవంతో తెలుగు సినిమా ఉనికిని జాతీయఆంతర్జాతీయ స్థాయిల్లో చాటిచెప్పడానికి సిద్దం అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు