‘కేరింత’ సెన్సార్ పూర్తి.. వచ్చే వారమే రిలీజ్!

‘కేరింత’ సెన్సార్ పూర్తి.. వచ్చే వారమే రిలీజ్!

Published on Jun 5, 2015 2:01 PM IST

kerintha

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాలకు పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు సెన్సిబుల్ సినిమాలను నిర్మిస్తూ తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు దిల్‌రాజు. తాజాగా ఆయన ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ అడవితో ‘కేరింత’ పేరుతో ఓ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే! సుమంత్ అశ్విన్, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ విడుదలకు సిద్ధమైంది.

ఈ రోజే ఈ సినిమా సెన్సార్ కార్యక్రామలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బౄందం ఈ సినిమాకు క్లీన్ యూ సటిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ తరపున కూడ మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై మంచి ఒపీనియన్‌ను క్రియేట్ చేశాయి. నేటితో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న విడుదలకు సిద్ధమైంది. ఇటు సమ్మర్ ఎండింగ్, కాలేజ్ స్టార్టింగ్ రెండూ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు కలిసివచ్చే అంశమని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు