“కేజీయఫ్ 2” నుంచి మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ వదిలిన మేకర్స్.!

Published on May 31, 2021 12:00 pm IST

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో విడుదలకు రెడీగా ఉన్న సెన్సేషనల్ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ కోసం దేశ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.

మరి ఈ గ్యాప్ లో మేకర్స్ ఈ చిత్రంలో కీలక నటుల పుట్టినరోజుకి గాను కేజీయఫ్ టైమ్స్ మ్యాగ్జైన్ పేరిట పలు ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వదులుతూ వస్తున్నారు. మరి అలా ఈ చిత్రంలో మరి ఇంట్రెస్టింగ్ పాత్ర “ఇనాయత్ ఖలీల్” గా చేస్తున్న నటుడు బాలకృష్ణ పై లేటెస్ట్ డీటెయిల్ వదిలారు.

ఇనాయత్ ఖలీల్ అతి పెద్ద సామ్రాజ్యం నారాచి ని ఆక్రమించడానికి ఎవరితో చేతులు కలుపుతాడు?అలాగే తన బర్త్ డే ని ఇండియాలో ఎక్కడో తెలియని ప్లేస్ లో జరుపుకుంటున్నాడని అందులో పొందుపరిచారు. మరి ఇతని రోల్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :