‘కెజిఎఫ్ 2’ టీజర్ : యుద్దాన్ని తలపిస్తోంది

‘కెజిఎఫ్ 2’ టీజర్ : యుద్దాన్ని తలపిస్తోంది

Published on Jan 7, 2021 10:09 PM IST

యాక్షన్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కెజిఎఫ్ 2’. చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్ర టీజర్ ను రేపు 8వ తేదీన హీరో యష్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ముందుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్లాన్ ప్రకారం కాకుండా ముందుగానే టీజర్ వదిలేశారు. కొద్దిసేపటి క్రితమే 9 గంటల 29 నిముషాలకు టీజర్ అధికారికంగా రిలీజ్ కాబడింది. కేవలం గంట ముందే మాత్రమే ఈ ముందస్తు రిలీజ్ నిర్ణయం తీసుకుని విడుదల చేశారు టీమ్.

దీంతో ప్రేక్షకుల ఎదురుచూపులు కొద్దిగంటల ముందే తెరపడినట్టైంది. టీజర్ అంచనాలకు తగ్గట్టే భారీతనంతో ఉంది. టీజర్లో పార్ట్ 2 నందు చేర్చబడిన అధీరా, రమికాసేన్ పాత్రలను రివీల్ చేశారు. ముఖ్యంగా హీరో రాఖీ భాయ్ పాత్రను విపరీతమైన ఎలివేషన్ ఇస్తూ చూపించారు. పవర్ఫుల్ వాయిస్ ఓవర్, ఒళ్ళు గగుర్పొడిచే బీజీఎమ్, ఇంట్రడక్షన్ షాట్స్, హెవీ యాక్షన్ షాట్స్ నిండిన టీజర్ సినిమా ఏ స్థాయిలో ఉంటుంది చెప్పేస్తోంది. ప్రేక్షకులు ఆశించినట్టే సినిమా మొత్తం యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నందు జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ అయ్యేలా ఉన్నాయి. మరి టీజరే ఇలా ఉంటే తర్వాత వచ్చే ట్రైలర్, చివరగా సినిమా ఎలా ఉంటాయో మరి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు