ఎన్టీఆర్ తో మూవీ కన్ఫర్మ్ చేసిన కెజిఫ్ డైరెక్టర్..!

ఎన్టీఆర్ తో మూవీ కన్ఫర్మ్ చేసిన కెజిఫ్ డైరెక్టర్..!

Published on May 20, 2020 5:45 PM IST

ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఈ మూవీ సెట్స్ పైకి కూడా వెళ్లనుంది. ఐతే ఎన్టీఆర్ తన 31వ చిత్రం కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నారంటూ కొన్నాళ్లుగా వరుస కథనాలు రావడం జరిగింది. కానీ దీనిపై దర్శక నిర్మాతల నుండి స్పష్టమైన ప్రకటన రాలేదు. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రశాంత్ నీల్ దీనిపై పరోక్ష ప్రకటన చేశారు.

ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తనదైన శైలిలో చెప్పారు. ‘న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చోవడం ఎంత ప్రమాదమో నాకు తెలుసు, ఆ ప్లాంట్ రేడియేషన్ తట్టుకోవడానికి మంచి సూట్ ధరించుకొని వస్తాను, హ్యాపీ బర్త్ డే బ్రదర్, త్వరలో కలుద్దాం ‘ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ ని డీల్ చేయడం అంత ఈజీ కాదు, కానీ మంచి పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో అన్నివిధాలా సిద్దమై వస్తాను అని ప్రశాంత్ నీల్ పరోక్షంగా చెప్పారు. దీనితో ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడు అనేది స్పష్టం అయ్యింది.

https://twitter.com/prashanth_neel/status/1262994247424176128

సంబంధిత సమాచారం

తాజా వార్తలు