కె జి యఫ్ క్రేజ్ మాములుగా లేదుగా !

Published on Dec 17, 2018 3:54 pm IST

ఈ మధ్యన ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసిన చిత్రం ‘కె జి యఫ్’. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రానికి భాష బేధం లేకుండా మంచి క్రేజ్ వచ్చింది. ఒక కన్నడ చిత్రానికి కూడా తెలుగులో ఇంత క్రేజ్ రావడం ఇదే మొదటి సారి. ఇక ఈ చిత్రం కన్నడ , తెలుగు , మలయాళం , తమిళ , హిందీ భాషల్లో డిసెంబర్ 21న విడుదలవుతుంది. ఒక్క ఇండియాలోనే ఈచిత్రం సుమారు 2000 థియేటర్లలో విడుదలకు సిద్దమైంది.

ఇక కన్నడలో దాదాపుగా 350 స్క్రీన్లలో విడుదలకానుండగా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి ప్రొడక్షన్స్ విడుదలచేస్తుంది. మరి భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :