“కేజీయఫ్ 2” నైజాం హక్కులకు అంత డిమాండ్ చేస్తున్నారా?

Published on Jan 27, 2021 2:00 pm IST

ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ మీదకు దండెత్తడానికి సన్నద్ధం అవుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. రాకింగ్ స్టార్ యష్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై తారా స్థాయి అంచనాలు నెలకొనడంతో అంతే స్థాయిలో ఈ సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ గానే కేజీయఫ్ మేకర్స్ డిమాండ్ చేస్తున్నారట.

ఇప్పటికే పలు ఏరియాలకు సంబంధించి రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతుందని సాలిడ్ ఫిగర్స్ బయటకొచ్చాయి. మరి అలా మన దగ్గర కీలక ప్రాంతం అయినటువంటి నైజాం కు సంబంధించి ఓ భారీ ఫిగరే వినిపిస్తుంది. ఇక్కడ మేకర్స్ హక్కుల కోసం ఏకంగా 75 కోట్లు చెప్పారట. అయితే ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నప్పటికీ అంత వసూలు చెయ్యడం కాస్త ఆలోచించదగినదే అని చెప్పాలి.

మరి ఈ హక్కుల విషయంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు కానీ అసలు ఫిగర్ ఎక్కడ ఆగిందో అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :