స్టార్ హీరోల సినిమాలకు కూడా లేని రికార్డు కేజీఎఫ్ సొంతం.

Published on Dec 7, 2019 9:38 am IST

2018 చివర్లో వచ్చిన ఒక చిత్రం చరిత్ర సృష్టించింది . ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రభంజనంగా మారింది. ఆ చిత్రమే కేజీఎఫ్. మొదట్లో ఈ చిత్రంపై ప్రేక్షకులలో కనీస ఆసక్తి లేదు. హీరో యష్ కూడా అసలు పరిచయం మరియు ఫేమ్ లేని హీరో. కన్నడ ఇండస్ట్రీలో మినహా అతని గురించి తెలిసింది చాలా తక్కువ. అలాంటి ఓ హీరో సినిమా ఇన్ని భాషలలో ఎందుకు విడుదల చేస్తున్నారు అనే ఆలోచన తప్ప ఆ మూవీపై ఎవరికీ అంత ఆసక్తిలేదు. విడుదల తరువాత ఆ చిత్రం అందరి అంచనాలు తల కిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ మరియు మలయాళ భాషలలో కేజీఎఫ్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా ఈ మూవీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. 2019 సంవత్సరానికి గాను అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా కేజిఎఫ్ నిలిచింది. కేజిఎఫ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా అత్యధికంగా వ్యూస్ సాధించి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించడం విశేషం.

సంబంధిత సమాచారం :

More