లాక్ డౌన్ రివ్యూ : ఖాలీ పీలీ ( జీ ప్లస్ లో ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : ఖాలీ పీలీ ( జీ ప్లస్ లో ప్రసారం)

Published on Oct 5, 2020 1:30 PM IST

తారాగణం: ఇషాన్ ఖత్తార్, అనన్య పాండే తదితరులు

దర్శకుడు: మక్బూల్ ఖాన్.
రచన : మక్బూల్ ఖాన్.
నిర్మాత : అలీ అబ్బాస్‌ జఫర్‌
ఎడిటర్ : ఎజాజ్ షాల్ఖ్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ఖాలీ పీలీ. మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘జీ ప్లస్’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ:

 

బ్లాకీ (ఇషాన్ ఖత్తార్) ముంబైలో ఒక యంగ్ క్యాబ్ డ్రైవర్. అయితే కొన్ని కారణాల వల్ల డ్రైవర్ల యూనియన్ సమ్మెను చేస్తారు. కానీ బ్లాకీ మాత్రం ఆ సమ్మెకు వెళ్లకుండా తన క్యాబ్‌ను నడపాలని నిర్ణయించుకుంటాడు. దాంతో కొంతమంది డ్రైవర్లతో అతనికి గొడవ అవుతుంది. ప్రమాదవశాత్తు, బ్లాకీ డ్రైవర్లలో ఒకరిని పొడిచి, అక్కడి నుండి పారిపోతాడు. అతను పరారీలో ఉన్న ఈ క్రమంలో పూజ (అనన్య పాండే) కలుస్తోంది. ఒక వేశ్యగృహం నుండి అలాగే గూండాల నుండి తప్పించుకుని పారిపోతూ కాపాడమని బ్లాకీని అడుగుతుంది. అందుకు అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తుంది. కానీ బ్లాకీ ఆమెను మోసం చేసి, గూండాల నుండి ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. వన్-నైట్ కారు ప్రయాణం యొక్క ఈ ఫిల్మ్ లో చివరకు ఏమి జరుగింది అనేది మిగతా కథ.

 

ఏం బాగుంది :

 

ఇషాన్ ఖత్తార్ తన తపోరి యాసను బాగా పలికించాడు. అలాగే ముంబైలోని గల్లీ బాయ్ లుక్‌ తో ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలిచాడు. పైగా అతను తన కామెడీ టైమింగ్ తో మంచి వినోదాన్ని కూడా అందించాడు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ ఈ చిత్రంలో చాలా మంచి హాస్యాన్ని తెచ్చింది. ఇక తన మునుపటి చిత్రాలతో పోలిస్తే అనన్య పాండే చాలా బాగా నటించింది. అలాగే ఆమె అందంగా కనిపిస్తూనే చాలా తేలికగా తన పాత్రను పోషించింది.

ఇక మొదటి భాగంలో మంచి సరదా సన్నివేశాలు ఉన్నాయి. మరియు సిట్యుయేషనల్ కామెడీ ద్వారా ఉత్పన్నమయ్యే హాస్యం కూడా చాలా చక్కగా ఉంది. కథనం కూడా బాగుంది. సినిమా ప్లే ప్రేక్షకులను చాలా వరకు పాత్రల సమస్యల్లో నిమగ్నం చేసింది.

ఇక జాకీర్ హుస్సేన్, సతీష్ కౌశిక్ తమ పాత్రలతో మెప్పించారు. అలాగే ఈ చిత్రంలో కొన్ని మంచి నైట్ విజువల్స్ ఉన్నాయి.మరియు ముంబై యొక్క క్రేజీ నైట్ లైఫ్ ను బాగా చూపించారు.

 

ఏం బాగాలేదు :

 

సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగాయి. అలాగే కొన్ని సీన్స్ తలనొప్పిగా మారతాయి. ప్రధాన జంట బాగా నటించినప్పటికీ, కథలో విషయం లేదు మరియు కథలో ఎక్కువ చేయగలిగేది కూడా ఏది లేదు. అలాగే, సినిమాను ముగించిన విధానం కూడా సినిమా మూడ్ ను పాడు చేస్తుంది.

పైగా సినిమా ఇతివృత్తం కూడా కొంచెం పాతది. దీనికి తోడు రెండవ భాగంలో ఏమి జరగబోతోందో ఊహించవచ్చు. విశాల్ శేఖర్ సంగీతం మరియు బిజియమ్ అసలు బాగాలేదు. ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. సతీష్ కౌశిక్ మంచి నటుడు అయినప్పటికీ, సినిమాలో అతని ట్రాక్ ప్రేక్షకులను చికాకుపెడుతుంది.

 

తుది తీర్పు:

 

మొత్తం మీద, ‘ఖాలీ పీలీ’ ఒక మాస్ మసాలా చిత్రం, ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకెండ్ హాఫ్ ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే సిట్యుయేషనల్ కామెడీ, నటీనటుల నటన బాగున్నాయి. కాకపోతే సాధారణ కథ, సక్రమంగా లేని స్క్రీన్ ప్లే ఈ సినిమా అవుట్ ఫుట్ ను దెబ్బ తీశాయి. మీరు టైం పాస్ చేయాలంటే ఈ సినిమా చూడొచ్చు. ప్రత్యేకంగా సమయం కేటాయించి చూసే సినిమా అయితే కాదు ఇది.

Rating: 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు