ఆ క్రేజీ రూమర్ కు చెక్ పెట్టిన “ఖిలాడి” మేకర్స్.!

Published on May 16, 2021 11:38 am IST

తన లేటెస్ట్ “క్రాక్” చిత్రంతో మాస్ మహారాజ్ రవితేజ సాలిడ్ హిట్ అండ్ సూపర్బ్ కం బ్యాక్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం అనంతరం మాస్ మహారాజ్ ఏమాత్రం లేట్ చెయ్యకుండా దర్శకుడు రమేష్ వర్మతో తన కెరీర్ లోనే భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన నయా చిత్రం “ఖిలాడి”.

మంచి అంచనాలు కూడా సెట్ చేసుకున్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ కోవిడ్ ప్యాండమిక్ టైం లో ఈ చిత్రానికి కూడా భారీ ఓటిటి ఆఫర్స్ వచ్చాయని మేకర్స్ కూడా అందుకు సుముఖంగా ఉన్నారని కొన్ని అనవసర రూమర్స్ మొదలయ్యాయి. కానీ మేకర్స్ ఆ క్రేజీ రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేసారు.

ఈ చిత్రం కేవలం థియేటర్స్ లోనే విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా కన్ఫర్మ్ చేసేసారు. సో ఆ క్రేజీ రూమర్స్ అన్నిటికీ చెక్ పడ్డట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :