కాంగ్రెస్ లో చేరిన కుష్బూ

కాంగ్రెస్ లో చేరిన కుష్బూ

Published on Nov 26, 2014 11:04 PM IST

Khushboo
సినీ నటి కుష్బూ ఒకానొక సమయంలో తను నటించిన సినిమాలతో అభిమానులను నిద్రపోనివ్వకుండా చేసింది. ఆమెపై అభిమానానికి తమిళనాట ఒక గుడి కూడా కట్టడం ఆశ్చర్యం కలిగించిన అంశాలలో ఒకటి. తన కాలంలో వెలుగువెలిగిన నటీమణుల వలే తను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి నిర్ణయించుకుంది

ఈరోజు న్యూ డిల్లి లో సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీల సమక్షంలో కుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ.వి.కె.ఎస్ ఎలాన్గోవన్ కూడా హాజరయ్యారు. మహిళా హక్కులు మరియు సామాజిక అంశాల లో కుష్బూ పలు న్యాయ పోరాటాలు జరిపింది. జయలలిత ఎన్నికలకు దూరమైన నేపధ్యంలో తమిళులకు కుష్బురుపంలో మరో జయలలిత దొరుకుంతుందేమో చూడాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు