రజిని సినిమాకి ఖుష్బూ కూడా చెప్పేసింది !

Published on Aug 16, 2021 8:00 am IST


సూపర్ స్టార్ రజినీకాంత్ మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్‌ లో వస్తోన్న సినిమా ‘అణ్ణాత్త’. ఇటివలే ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేశారు రజిని. అలాగే సీనియర్ హీరోయిన్ మీనా కూడా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ ను పూర్తి చేశారు. ఇక ఈ సినిమాని నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రజినీ – శివ కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. పైగా ఈ సినిమాలో రజిని లుక్ ఓ రేంజ్ లో ఉండటంతో ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన మీనా, ఖుష్బూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌ సన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :